28 May 2009

మేఘ సందేశం - Cloud Messenger

అల్లంత ఎత్తున మేఘమై నేను
లోయంత లోతున నగమై నీవు
అనాదిగా నీ సొంపులు చూసి వగచి
ఏనాడూ అంతరాళం దాటి, నీదరి రాలేక
ఇదిగో ఇలా నాలోని భాగాన్నే, మేఘాన్నే
నీకై ప్రేమ లేఖగా పంపుతున్నాను

Seperated by spaces
For aeons and aeons.
Could not resist the urge
To send you a short message.
Lo! Here it is, a piece of me
A souvenir let it be.

19 May 2009

మట్టిదోవ - Gravel Road

అల ఆంటారియా దేశాన
ఒంటరిగా వెళుతున్న నన్ను
వంపులతో వగచి
వయ్యారంగా పిలిచిందీ తోవ
మృదువుగా తాకడానికి మట్టీ
పదునుగా కొయ్యడానికి మంచూ
ఆత్రంగా బండి తిప్పిననాకు
అదో వింత సుఖం మిగిల్చింది

పావుగంట మా ప్రేమకు
ప్రతిరూపమే ఈ ప్రతిబింబం
--
Sinuous road in Ontario
Beckons this traveler lonely
Muddy feet and skin of snow
Give into her, he had to slowly

The romance was oh-so short
This photo is all that's left

14 May 2009

బారులు తీరిన కారులు - Rays of Cars

బారులు తీరిన కారులు
మెట్లుగ పేర్చిన కొండలు
హారను మోగని సంస్కృతి
తైలము తాగెడి వికృతి

పట్ట పగలే బల్బు లైట్లట
వీళ్ళ శిగతరగ
బత్తీ బందని
మర్చే పోయారా?

1 May 2009

ఇందీవరము - Blue Water Lilly

తమ్మి పుష్పము తన తపనుని కోసము
పుడమి తల్లి నుండి పొడుచుకొచ్చెఁ
తేలి నీటఁ ముందు, తేలెఁ బిదపఁ నీటి
తలము పైన! యెంత దాని తపన!
I look at my lord
High in the sky
How his heart burns
With love for me.

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP