1 May 2009

ఇందీవరము - Blue Water Lilly

తమ్మి పుష్పము తన తపనుని కోసము
పుడమి తల్లి నుండి పొడుచుకొచ్చెఁ
తేలి నీటఁ ముందు, తేలెఁ బిదపఁ నీటి
తలము పైన! యెంత దాని తపన!
I look at my lord
High in the sky
How his heart burns
With love for me.

8 వ్యాఖ్యలు (comments):

Unknown 4 May 2009 at 5:32 pm  

భలే ఉంది
అందమే ఆనందం అని పాడాలని ఉంది

ఊదం 8 May 2009 at 8:04 pm  

బేసి కంటి సృజన?

teresa 15 May 2009 at 12:27 am  

Beautiful!

మెహెర్ 31 October 2009 at 4:54 pm  

మీరు కవి. ఇంకా మాటాడితే ఒత్తు ఖ్ఖవి. ఇంగ్లీషు కవిత చాలా బాగుంది.

rākeśvara 31 October 2009 at 5:23 pm  

కష్టపడి ఆటవెలది ఛందస్సులో మఱీ వ్రాస్తేను, మీరు ఇంగ్లీషు కవిత బాగుందనడం, కాస్త విచారం కలిగించింది.

మన తరము యొక్క విషాదమే ఇదండి. ఆంగ్లమంటే ఆంగ్లమూ కాదు. తెలుఁగంటే తెలుఁగూ కాదు!

మెహెర్ 31 October 2009 at 5:35 pm  

మీరు నా వ్యాఖ్యకి "రాజు గారి పెద్ద భార్య, చిన్నభార్య" తరహా తర్కాన్ని అన్వయించుకున్నట్టున్నారు. తెలుగు కవిత కూడా బాగుంది. కానీ చందస్సులో ఉక్కిపోయో ఏవిటో ఇంగ్లీషు కవిత గుచ్చుకున్నంత సూటిగా గుచ్చుకోవటం లేదు. అదీ గాక, "తేలి నీటఁ ముందు, తేలెఁ బిదపఁ నీటి తలముపైన!" అంటే సరిగా అర్థం కావటం లేదు. నీట తేలడమన్నా, నీటి తలముపైన తేలడం అన్నా ఒకటే కాదూ? పునరుక్తి అనిపించటం లేదూ? లేక రెండిట్లో తేడా ఏమన్నా వుందా? అదీగాక, పువ్వు పుట్టి నీట్లో తేలడమన్న దానిలో సూర్యుని పట్ల తపనేం వుంది? దీనికి భిన్నంగా రెండోదైన ఆంగ్ల కవితలో, పువ్వు చేత మాట్లాడించడంతో, ఆ తపనేదో నిజంగా కనిపిస్తుంది. ఆటవెలదో తేటగీతో కవిత భావానికి దన్నుగా నిలబడాలి గానీ, కప్పేస్తే ఫలితం ఏముంది. కాదంటారా.

rākeśvara 31 October 2009 at 5:54 pm  

"తేలి నీటఁ ముందు, తేలెఁ బిదపఁ నీటి తలముపైన!"
భూమిని చీల్చుకొని వచ్చి నీటిలో తెలింది.
ఆపై, నీరుందేంటబ్బా అని ఇంకా పైకి తెలింది.

ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుందంటేనే ఎంత చెత్త పద్యమో అర్థమవుతుంది. :)

నేను మొదట ఆంగ్లంలో వ్రాసేవాడిని. తెలుఁగులో కుదిరేది కాదు.
కష్టపడి సాధన చేస్తే రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది. కానీ ఎప్పటికైనా తెలుఁగులోనే ఆరితేరాలని ఆశయం.

మధ్యలో కొంత ఛందస్సు కూడా ప్రయత్నించాను , దాని వలనే ఆ శ్రీశ్రీ ఆధారిత సన్న్యాసి కవిత వచ్చింది.

చూద్దామండి ఎటుపోతుందో నా కవిత్వం నా కెమరాపనివాడితనం. :)

కౌటిల్య 9 January 2010 at 10:20 pm  

mm...title marchesaru gaa

నా గుఱించి

రాకేశ్వర రావు
అహం బొమ్మాస్మి ఆ బేసికంటి సృజన నా బేసికన్ను చూసెఁ
నవతరంగం సినిమా కూడలి

అనుచరులు - Followers

  © Free Blogger Templates 'Photoblog II' by Ourblogtemplates.com 2008

Back to TOP